మోర్తాడ్, జూన్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మోర్తాడ్ మండల కేంద్రంలో రోజురోజుకు దొంగల అలజడి పెరిగిపోతుందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామంలో పోలీసులు రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తున్నప్పటికీ వారం రోజులలో ఎస్‌సి వాడలో రెండుసార్లు దొంగలు రావడంతో వారిని పట్టుకోవడానికి యువకులు ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ చాకచక్యంగా పారిపోయారని చెబుతున్నారు.
ఏది ఏమైనప్పటికీ గ్రామంలో ఆయా వీధుల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి గస్తీ తిరిగితే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అయినప్పటికీ కూడా పోలీస్ అధికారులు ఇంకాస్త ఎక్కువ సార్లు పెట్రోలు చేస్తే బాగుంటుందని, పోలీసులు కూడా గ్రామంలోని అన్ని వీధులలో తప్పనిసరిగా పెట్రోలింగ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.