డిచ్‌పల్లి, జూన్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గల బయోటెక్నాలజీ అండ్ బాటనీ మరియు కంప్యూటర్ సైన్స్ కళాశాలలో స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ విభాగాలను మంగళవారం ఉదయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ రిజిస్ట్రార్ ఆచార్య నసీంతో కలిసి సందర్శించారు.
మొదటగా ఆయా విభాగాలలోని అధ్యాపకులు, అకడమిక్ కన్సల్టెంట్స్, లాబ్ అసిస్టెంట్ లు, బోధనా తరగతులు, ప్రయోగశాలలు, పరిశోధకులు, విద్యార్థుల వివరాలను విభాగాధిపతులను అడిగి తెలుసుకున్నారు.
వివిధ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ వర్క్స్, పరిశోధనల గూర్చి తెలుసుకున్నారు. వివిధ దేశాలలోని విశ్వవిద్యాలయాలలో అధ్యాపకుల, విద్యార్థుల పరిశోధనలు, సాధించిన అవార్డులు, ప్రచురించిన వ్యాసాలు, ఇంపాక్ట్ ఫ్యాక్టర్స్, పేటెంట్ హక్కులను గూర్చి అడిగారు.
బయోటెక్నాలజీ వివరాలు
ఫంక్షనల్ జీనోమిక్స్, ఫ్లాంట్ బయోటెక్నాలజీ, మెడికల్ బయోటెక్నాలజీ, ఫ్లాంట్ జీనోమిక్స్, ఆనిమల్ బయోటెక్నాలజీ, ఎన్విరాన్ మెంటల్ వంటి బయోసైన్స్ రంగాలలో నిష్ణాత సాధించారని విభాగాధిపతి డా. కిరణ్మయి వీసీకి తెలిపారు.
సి ఎస్ ఈ ఆర్ సాధించిన విద్యార్థులున్నారనిపేర్కొన్నారు. యూజీసీ అండ్ డిఎస్ టి, సెర్బ్ వంటి సంస్థల నుంచి ప్రాజెక్ట్ లను అధ్యాపకులు, పరిశోధకులు పొందినట్లుగా తెలిపారు. తెలుగు అకాడమీ నుంచి బయో సైన్స్ పాఠ్యపుస్తకాలు రచించారని తెలిపారు.
నేషనల్ సెమినార్స్, వర్క్ షాప్స్ నిర్వహించినట్లు తెలిపారు. అసోషియేట్ ఫెలో ఆఫ్ తెలంగాణ అకాడమి ఆఫ్ సైన్స్ (టాస్), బెస్ట్ ఓరల్ ప్రజెంటేషన్ వంటి గుర్తింపులు అవార్డులు సాధించినట్లు వివరించారు.
అమెరికా, చైనా వంటి తదితర దేశాలలో పరిశోధక శాస్త్రవేత్తలుగా పని చేశారని చెప్పారు. అధిక ఇంపాక్ట్ ఫాక్ట్స్ ఉన్న జర్నల్స్ లో పరిశోధనలు అచ్చు అయ్యాయని తెలిపారు. విభాగంలోని డా. మహేందర్ ఐలేని, డా. ప్రసన్న శీల, జవేరియా బేగం, ప్రసన్న, అనూజ, పోశెట్టి తదితర సిబ్బందిని వీసీకి పరిచయం చేశారు.
బాటనీ వివరాలు
వృక్ష శరీర ధర్మశాస్త్రం, శైవల శాస్త్రం, వృక్ష జీవ సాంకేతిక శాస్త్రం, శిలీంద్ర వృక్ష వ్యాధి శాస్త్రం వంటి రంగాలలో ప్రావీణ్యం సాధించిన ఫ్యాకల్టీ ఉన్నట్లుగా విభాగాధిపతి ఆచార్య విద్యావర్ధిని వీసీకి తెలిపారు. యూజీసీ, సి ఎస్ ఐ ఆర్ అండ్ సెర్బ్ వంటి సంస్థల నుంచి ప్రాజెక్టులు పొందినట్లు తెలిపారు.
దేశంలోని వివిధ గుర్తింపు పొందిన వృక్ష శాస్త్ర సంస్థలతో అనుబంధం ఉన్నట్లు పేర్కొన్నారు. నాగ్ పూర్ కాటన్ రీసెర్చ్ ఇన్సి టిట్యూట్ తో ఎం ఒ యు ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. స్ప్రింగల్, టైలర్, స్పాన్సిస్, ఎల్స్ వేర్ వంటి ఇంట్నేషనల్ జర్నల్స్ లో పబ్లికేషన్స్ వచ్చయని తెలిపారు.
15 మంది పిహెచ్. డి. పరిశోధకులు డాక్టరేట్ సాధించారని అన్నారు. విభాగంలోని డా. అరుణ, డా. అలీం ఖాన్ డా. శ్రీనివాస్, డా. జలందర్, రవి, సురేష్ తదితర సిబ్బందిని వీసీకి పరిచయం చేశారు.
స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ వివరాలు
స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ వంటి సబ్జెక్టుల్లో ప్రావీణ్యం సాధించిన అకడమిక్ కన్సల్టెంట్స్ ఉన్నట్లు విభాగాధిపతి డా. సంపత్ కుమార్ వివరించారు. గతంలో ఫిజిక్స్ అండ్ జియో ఇన్ ఫార్మాటిక్స్ విభాగాలకు కూడా తానే విభాగాధిపతిగా వ్యవహరించానని పేర్కొన్నారు.
ఆల్ ఇండియా సర్వే ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థతో అనుబంధం ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. యూనివర్సిటీకి నోడల్ ఆఫీస్ గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. అసిస్టెంట్ సర్కిల్ అఫీసర్ గా, విప్రో కంపెనిలో విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని అన్నారు.
ఇటాలియన్ జర్నల్స్, ఇంటర్నేషనల్ జర్నల్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ & మ్యాథ్స్ లో పబ్లికేషన్స్ ప్రచురించబడ్డాయని అన్నారు. తమ విభాగానికి రీసెర్చ్ లాబ్ తప్పక ఏర్పాటు చేయాలని వీసీని కోరారు. విభాగంలోని డా. పురుషోత్తం, డా. సందీప్, డా. రాజేశ్వర్, డా. నర్సింలు, డా. చంద్రశేఖర్, డా. శ్రీనివాస్, డా. పద్మావతి, డా. శ్వేత తదితర సిబ్బందిని వీసీకి పరిచయం చేశారు.
కంప్యూటర్ సైన్స్ వివరాలు
కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ అనుబంధ కోర్సులకు చెందిన అధ్యాపకులు ఉన్నారని విభాగధిపతి డా. బి. నందిని వివరించారు. కంప్యూటర్ సైన్స్ కోర్సు ఒకటి మాత్రమే ఉందని ఇంజనీరింగ్ కోర్సులు కూడా సాంక్షన్ చేయాలని కోరారు.
వివిధ పోటీ పరీక్షలకు వెబ్ కౌన్సిలింగ్ వారి విభాగం ముంచే జరుగుతుందని అన్నారు. గతంలో చికాగో స్టేట్ యూనివర్సిటి నుంచి ఎం ఒ యు పొందిన విషయాన్ని తెలిపారు. విభాగంలోని డా. ఆరతి, డా. అథిక్, డా. భ్రమరాంబిక, డా. నీలిమా, డా. నవీన్ కుమార్ తదితర సిబ్బందిని వీసీకి పరిచయం చేశారు.
ఐదు విభాగాలను సందర్శించిన వీసీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా విభాగాలలో జరుగుతున్న పరిశోధనలను, ప్రాజెక్ట్ లను తెలుసుకొని ప్రశంసించారు. బయో టెక్నాలజీ, బాటనీ, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని అన్నారు.
ఈ సందర్భంగా కంప్యూటర్ సైన్స్ లో గల సి సి కెమెరా ఆపరేటింగ్ ఆఫీస్, స్పోర్ట్స్ ఆఫీస్ సందర్శించి, స్పోర్ట్స్ ఇంచార్జ్ డా. అబ్దుల్ ఖవి, పి డి నేతా ను అడిగి స్పోర్ట్స్ వివరాలు తెలుసుకున్నారు.