కామారెడ్డి, జూన్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బుధవారం సీఎం పర్యటనలో భాగంగా కామారెడ్డి జిల్లా కు మెడికల్ కళాశాలను, విద్యాసంస్థలను కేటాయించాలని కోరుతూ నిరసన తెలియజేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు బాలు, లక్ష్మణ్, సంతోష్ గౌడ్ లను అరెస్టు చేయడం అప్రజాస్వామ్యమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
సీఎం గతంలోనే 2018 ఎన్నికల్లో నూతనంగా మెడికల్ కళాశాలను కామారెడ్డి పర్యటనకు వచ్చినప్పుడు తెలియజేయడం జరిగిందని, డిగ్రీ కళాశాల భూములలలో నూతన విద్యా సంస్థలను ఏర్పాటు చేసి కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్ గా చేస్తానని మాట తప్పిన కేసీఆర్ వెంటనే కామారెడ్డి పర్యటనలో వాటికి సంబంధించిన అనుమతులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
అరెస్టు చేసిన విద్యార్థి సంఘాల నాయకులను విడుదల చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలను సాధించుకునే వరకు ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.