నిజామాబాద్, జూన్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్ర రోడ్లుభవనాలు, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి, టిఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు.
బుధవారం విప్ బాల్క సుమన్ ను పరామర్శించడానికి మెట్పల్లి మండలం రేగుంట పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో వేల్పూర్లో క్రాస్ రోడ్డు వద్ద ఆగారు. స్వర్గీయ సురేందర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లిన సీఎం కేసీఆర్ కాసేపు సేద తీరారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలతో పాటు అధికారులతో మాట్లాడారు.
తిరిగి రోడ్డు మార్గంలో హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఎంపీ సంతోష్ రావు, ఎమ్మెల్సీ సుభాషన్ రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.