కామారెడ్డి, జూన్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బుధవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నియామకమైన రామారెడ్డి ఎంపీడీవో విజయ్ కుమార్ ని ఘనంగా సన్మానించినట్టు రామారెడ్డి మండలాధ్యక్షులు లక్కాకుల నరేష్ అన్నారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించి కరోన మహమ్మారి ని తరిమి కొట్టాలన్నారు . ప్రతి ఒక్కరు లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని అన్నారు.
కార్యక్రమంలో ఎంపీఓ సవిత, ఏపీఓ ధర్మారెడ్డి, సమాచార హక్కు చట్ట ప్రతినిధులు ఉపాధ్యక్షులు భవాని పేట సుమన్, ప్రధాన కార్యదర్శి నేరెళ్ల నవీన్, కార్యదర్శులు ఛత్రబోయిన హనుమాన్లు, భవాని పేట నితిన్ తదితరులు పాల్గొన్నారు.