కామారెడ్డి, జూన్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ కామారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మున్సిపల్ కార్యాలయం వద్ద గల వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించారు.
అక్కడ సమస్యల గురించి, వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరు గురించి ప్రజలను, ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కుంటా లక్మరెడ్డి మాట్లాడుతూ కరోనా కట్టడిలో దేశ ప్రధాని నరేంద్రమోదీ ఆక్సిజన్ కొరత ఏర్పడినా, ఆసుపత్రిలో బెడ్ల కొరత ఏర్పడినా, ఇంజక్షన్ ల కొరత ఏర్పడినా ఇలా ఏ సమస్య వచ్చినా అనునిత్యం ప్రజల వెంటే ఉంటూ మొదటి సారి లాక్‌డౌన్ వచ్చినప్పుడు 6 నెలల పాటు ఉచితంగా రేషన్ పంపిణీ చేసిన మాదిరిగానే ఇప్పుడు కూడా 6 నెలల పాటు పేదలందరికి ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
మున్సిపల్ బీజేపీ ప్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఉచిత వ్యాక్సిన్ కేంద్రమే అందజేస్తోందని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కరోనా బారిన పడకుండా చూసుకోవాలని అన్నారు.