కామారెడ్డి, జూన్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రానికి గతంలో సీఎం ఇచ్చిన మాట ప్రకారం మెడికల్ కళాశాలను, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, బి.ఎడ్ కళాశాలల ఏర్పాటు చేయాలనీ కోరుతూ బుధవారం పెద్దపల్లి పర్యటనకు బయల్దేరిన కేసీఆర్ కాన్వాయ్ ముందు నిరసన తెలియజేయడానికి దక్షిణ ప్రాంగణం ముందు ప్రయత్నం చేసిన విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో కేసీఆర్ కామారెడ్డి జిల్లాలో ఎడ్యుకేషన్ హబ్ గా ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారని ఆ దిశగా ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అని వెంటనే మెడికల్ కళాశాల నూతన విద్యాసంస్థలను మంజూరు చేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.
నూతన విద్యాసంస్థలు వచ్చేంత వరకు ఆందోళనలను ఉధృతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి లక్ష్మణ్ యాదవ్, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, పోసు శివ, వంశీ లాల్ లను అరెస్టు చేసి బిక్నూర్ పోలీస్ స్టేషన్కి తరలించారు.