కామారెడ్డి, జూన్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జహీరాబాద్ నారాయణఖేడ్ ఆందోల్ నియోజకవర్గంలో ఉన్న వ్యవసాయ భూములను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను మంజూరు చేశారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు.
బుధవారం జహీరాబాద్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ప్రభుత్వం కాళేశ్వరం నీటి ద్వారా సింగూర్ ప్రాజెక్టు నింపి సింగూరు నుంచి ఎత్తిపోతలకు నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.
సంగమేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను ఈనెల 12వ తేదీన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభిస్తారన్నారు. కోహిర్ మండలం లోని వెంకటాపూర్ గ్రామ శివారులో నిర్మాణం జరుగుతుందన్నారు.
సమావేశంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు, మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు ఉన్నారు.