మోర్తాడ్, జూన్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో బుధవారం సీఎం కాన్వాయ్ కి మోర్తాడు మండల తెరాస నాయకులు ఘన స్వాగతం పలికారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం లోని రేగుంట గ్రామంలో చీరాల ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి మృతి చెందడంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆయన కుటుంబానికి పరామర్శించడానికి వెళుతుండగా మోర్తాడ్ మండల టిఆర్ఎస్ నాయకులు గాండ్ల పేట గ్రామం నుండి మోర్తాడ్ వరకు సీఎం కాన్వాయ్ కి ఘన స్వాగతం పలికారు.
సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా కెసిఆర్ తో ఉన్నారు.
కార్యక్రమంలో మండలం టిఆర్ఎస్ నాయకులు, మండల జడ్పిటిసి బద్దం రవి, ఎంపీపీ శివ లింగు శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ బోగ ధరణి ఆనంద్, కో ఆప్షన్ మెంబర్ ఇంతియాజ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కల్లెడ ఏలియా, తదితర నాయకులు పాల్గొన్నారు.