Daily Archives: June 10, 2021

కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

గాంధారి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గురువారం గాంధారి మండలంలోని వివిధ గ్రామాల్లో 187 మంది లబ్ధిదారులకు సుమారు రెండు కోట్ల రూపాయలు కళ్యాణలక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజ‌ల సురేంద‌ర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని బంగారు తెలంగాణ సాధన ఒక్క కెసిఆర్ నాయకత్వంలో మాత్రమే …

Read More »

నిజామాబాద్ లో ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు కార్యకర్తలు, నాయకులకు నిజామాబాద్ క్యాంప్ ఆఫీస్ లో అందుబాటులో ఉంటారు. తనను కలవడానికి వచ్చే వారు తప్పనిసరిగా కోవిడ్ నియమ నిబంధనలు పాటించి మాస్క్ ధరించవలసిందిగా ఆమె కోరారు.

Read More »

న‌సురుల్లాబాద్ మండలం లో భారీ వర్షం…

నసురులబాద్‌/ బీర్కూర్‌, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నసురులబాద్‌/ బీర్కూర్‌ మండ‌లాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం మొదలైన వర్షం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. భారీ వర్షానికి పంటపొలాలు చెరువు ను తలపిస్తున్నాయి. ఆయా గ్రామాలలోని ప్రధాన దారులు నీటితో నిండినవి. డ్రైనేజీలు, పంటకాలువల‌లో నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. రైతన్న వర్షానికి పంటపొలలో నారుమడికి సిద్దం చేస్తున్నాడు. వర్షానికి ఆనందంలో తడిసి ముద్దయ్యాడు.

Read More »

భారీ మొత్తంలో గుట్కా, జ‌ర్దా స్వాధీనం

నిజామాబాద్‌, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః డిచ్‌ప‌ల్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని రెండు గోదాముల‌లో భారీ మొత్తంలో గుట్కా, జ‌ర్దా స్వాధీనం చేసుకున్న‌ట్టు పోలీసు క‌మీష‌న‌ర్ కార్తికేయ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. పోలీసు క‌మీష‌న‌ర్ కార్తికేయ ఉత్త‌ర్వుల మేర‌కు గురువారం టాస్క్ ఫోర్స్ ఇన్స్‌పెక్ట‌ర్ షాకేర్ అలీ , వారి సిబ్బంది డిచ్‌ప‌ల్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ధ‌న‌ల‌క్ష్మి, రాందేవ్ హోల్‌సేల్ దుకాణాల‌లో అక్ర‌మంగా గుట్కా, …

Read More »

కామారెడ్డికి రాష్ట్రంలో మొదటి స్థానం

కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఉపాధి హామీ పనులలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం 2 ల‌క్ష‌ల 1 వేయి 302 మంది ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారని, ఇప్పటివరకు 57 ల‌క్ష‌ల 88 వేల 816 లక్షల పనిదినాలను జనరేట్ చేయడం జరిగిందని, 96 కోట్ల, 52 …

Read More »

ష‌బ్బీర్ అలీ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఇద్ద‌రికి ర‌క్త‌దానం

కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్ వారి షబ్బీర్ అలీ పౌండేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు రోగులకు రక్తం అందించి వారిని కాపాడారు. గురువారం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు రోగులకు అత్యవసరంగా రక్తం అవసరం కాగా సహాయం కొరకు షబ్బీర్ అలీని ఫోన్ లో సంప్ర‌దించారు. వెంటనే స్పందించి …

Read More »

ఏబివిపి ఆధ్వ‌ర్యంలో క‌రోనా స‌ర్వే

బీర్కూర్‌, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఏబివిపి ఫ‌ర్ సొసైటీ అభియాన్ స‌ర్వీస్ ఆక్టివిటిస్ మెగా డ్రైవ్‌ లో భాగంగా గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో క‌రోన స‌ర్వే చేప‌ట్టారు. ఎంత మంది క‌రోనాతో చనిపోయారు, ఎంతమందికి కరోనా వచ్చింది, ఎంత మంది కోలుకున్నారు అనే అంశ‌లను ఇంటింటికి తిరుగుతూ సేక‌రించారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రజలు కరోనా తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న …

Read More »

కోట స్థ‌లాన్ని క‌బ్జా నుండి కాపాడండి

బోధ‌న్‌, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బోధన్ లోని మొచ్చి కాలనీ 29 వ వార్డ్ రెంజల్ బేస్ ప్రాంతంలోని అతి పురాతనమైన మట్టి కోట ఇటీవ‌ల‌ కురిసిన వర్షానికి అందులోని అతి పురాతనమైన కట్టడాలు బయట పడ్డాయి. దీంతో ఇక్కడి ప్రజలు పురాతనమైన కోటను ఉన్నత అధికారులు పర్యవేక్షించి కోట స్థలాన్ని కబ్జా కాకుండా చూడాలని, పురావస్తు శాఖ వారికి విషయాన్ని తెలియ బరిచి …

Read More »

రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ కి రక్తదానం

కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా బాన్స్ వాడ కు చెందిన పర్హన బేగం (23) గర్భిణీ స్త్రీ బాన్సువాడ ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతుండటంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు ను సంప్రదించారు. వారికి కావలసిన ఏ పాజిటివ్ రక్తాన్ని పెద్దమల్లారెడ్డికి చెందిన ఏర్వ రవీందర్ సహకారంతో 2 యూనిట్లు అందజేయడం జరిగిందని తెలిపారు. ఆపద సమయంలో …

Read More »

జూరాలకు వరద

మహబూబ్‌నగర్‌, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టులో గేట్ల మరమ్మతు కారణంగా నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో నిన్నటి నుంచి జూరాల ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చిచేరుతున్నది. ప్రాజెక్టులో ప్రస్తుతం 318.420 మీటర్ల ఎత్తులో నీటిమట్టం ఉన్నది. నీటి నిల్వ 9.459 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »