బీర్కూర్, జూన్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఏబివిపి ఫర్ సొసైటీ అభియాన్ సర్వీస్ ఆక్టివిటిస్ మెగా డ్రైవ్ లో భాగంగా గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో కరోన సర్వే చేపట్టారు. ఎంత మంది కరోనాతో చనిపోయారు, ఎంతమందికి కరోనా వచ్చింది, ఎంత మంది కోలుకున్నారు అనే అంశలను ఇంటింటికి తిరుగుతూ సేకరించారు.
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రజలు కరోనా తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ ప్రజలకు అండగా మేమున్నాం అంటూ ఏబీవీపీ నడుము కట్టింది.
ఏబివిపి బీర్కూర్ మండలం కిష్టపూర్ గ్రామంలో గురువారం సర్వే నిర్వహించారు. ఇప్పటి వరకు గ్రామంలో 16 మంది కరోనా వచ్చి కోలుకున్నారని, ఇప్పటి వరకు ఎవరు కూడా మృతి చెందలేదన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
కరోనతో బాధపడుతున్న వారికి ఉచితంగా మెడిసిన్ ఇస్తామని అదేవిదంగా ఎవరైనా చనిపోయిన వారి ఇంట్లో చిన్న పిల్లలు అనాధలుగా ఉంటే వారికి విద్యనందించడంలో సహాయపడుతామని అన్నారు.
కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ భానుప్రసాద్, నాయకులు సంజీవ్, సాయి, మహేష్,తదితరులు పాల్గొన్నారు.