నసురులబాద్/ బీర్కూర్, జూన్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నసురులబాద్/ బీర్కూర్ మండలాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం మొదలైన వర్షం రాత్రి వరకు కురుస్తూనే ఉంది.
భారీ వర్షానికి పంటపొలాలు చెరువు ను తలపిస్తున్నాయి. ఆయా గ్రామాలలోని ప్రధాన దారులు నీటితో నిండినవి.
డ్రైనేజీలు, పంటకాలువలలో నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. రైతన్న వర్షానికి పంటపొలలో నారుమడికి సిద్దం చేస్తున్నాడు. వర్షానికి ఆనందంలో తడిసి ముద్దయ్యాడు.