కామారెడ్డి, జూన్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఉపాధి హామీ పనులలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ ఒక ప్రకటనలో తెలిపారు.
గురువారం 2 లక్షల 1 వేయి 302 మంది ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారని, ఇప్పటివరకు 57 లక్షల 88 వేల 816 లక్షల పనిదినాలను జనరేట్ చేయడం జరిగిందని, 96 కోట్ల, 52 లక్షల, 25 వేల రూపాయలు కూలీ క్రింద చెల్లించడం జరిగిందని తెలిపారు.
కామారెడ్డి జిల్లా ఉపాధి హామీ పనులలో తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని అట్టి ప్రకటనలో తెలిపారు.