హైదరాబాద్, జూన్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణలో పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డు దరఖాస్తులను ఆమోదించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ ప్రక్రియ కోసం వేగంగా కరసరత్తు జరుగుతోంది.
ఈ నేపథ్యంలో మీరు ఇదివరకే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసి ఉంటే ఆ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునేందుకు మీ సేవకు పరుగు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి మీ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా చాలా సులభంగా దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు. అదెలానో తెలుసుకుందాం.
ముందుగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ వెబ్ సైట్ లింక్: https://epds.telangana.gov.in /FoodSecurityAct/ కి వెళ్లాలి. అందులో లెఫ్ట్ సైట్ లో మొదటి ఆప్షన్ ఎఫ్ఎస్ సీ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో రేషన్ కార్డు సెర్చ్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైకి కర్సర్ తీసుకెళ్తే మరో రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
వాటిలో ఎఫ్ఎస్ సీ అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో మీరు ఏ జిల్లాకు దరఖాస్తు చేసుకున్నారో ఎంచుకోవాలి. పక్కనే మొబైల్ నంబర్, మీసేవ నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి సబ్ మిట్ చేస్తే కుడి వైపు చివర్లో మన దరఖాస్తు స్టేటస్ రిజెక్ట్ అయిందా లేక అప్రూవ్ అయిందా అనే విషయం తెలిసిపోతుంది.