కామారెడ్డి, జూన్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కు మెడికల్ కళాశాల ను కేసీఆర్ పర్యటన లోపే మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘ ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి సాయి రెడ్డి, ఖయ్యుంలకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2018 ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డి జిల్లా కు మెడికల్ కళాశాల తో పాటు నూతన విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తానని కెసిఆర్ మాట ఇచ్చారని ఈ వారంలో కేసీఆర్ పర్యటన కామారెడ్డి లో ఉందని పర్యటన లోపే నూతన విద్యా సంస్థలకు సంబంధించిన అనుమతులను మంజూరు చేస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
నూతన విద్యాసంస్థల సాధనలో భాగంగా కామారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలను , ప్రజా సంఘాలను, అన్ని రాజకీయ పార్టీలకు వినతి పత్రాలను అందజేసి మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, భరత్ , కుంభాల లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.