బోధన్, జూన్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పీ ఎఫ్ అదికారుల నిబంధనల మూలంగా ఈ పీ ఎఫ్ కట్ అవుతున్న బీడీ కార్మికుల తో పాటు ఇతర రంగాల కార్మికులు వారి ఉపాధిని కోల్పోతున్నారని తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టీ యూ) జిల్లా కార్యదర్శి బి మల్లేష్ అన్నారు.
శుక్రవారం బోధన్ పట్టణం లోని తట్టికోట్ లో బీడీ కార్మికుల తో జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ కే వై సీ కార్మికులకు పీ ఎఫ్ ను వారి ఎకౌంట్ లో జమ చేయమనే నిబంధనల తో బీడీ ఫ్యాక్టరీ ల యాజమాన్యాలు కే వై సీ సరి కానటువంటి కార్మికులకు పని ఇవ్వడం లేదు.
దీనితో జిల్లా లోని టెలిఫోన్, దేశాయి, శివ సాగర్ బీడీ ఫ్యాక్టరీ ల తో పాటు అనేక కంపనీల లో పని చేస్తున్న బీడీ కార్మికులు తమ ఉపాధినికోల్పో తున్నారని అన్నారు. కరోనా మహమ్మారితో ఇతర పనులన్ని బంద్ పడి కుటుంబం లో గల బీడీలు చేసే వారు మాత్రమే కాస్తో కూస్తో బీడీలు చేస్తూ కుటుంబాలను పోషిస్తున్న సమయంలో పీ ఎఫ్ అధికారుల నిబంధన ల తో వారు చేసుకునే ఆ కాస్త పని కూడా కొల్పోతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొవిడ్-19, లాక్ డౌన్ మూలంగా ‘మీ సేవ’, ఈ సేవ ల లో వేలాది కార్మికుల కే వై సీ చేయించడం సాద్యం కాదని దానికీ కొంత సమయం ఇవ్వాలని, అప్పటి వరకు కార్మికులకు పనుల నుంచి తొలగించవద్దని, వారికి పనులు కల్పించి, వారి పేమెంట్ల నుండి కట్ చేసిన పీ ఎఫ్ ను వారి పీ ఎఫ్ ఎకౌంట్ల లో యదా విధిగా జమ చేయాలని డిమాండ్ చేశారు.
లేని యెడల కార్మికుల తో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో నాగయ్య, నాగభూషణం, బి.నాగమణి, సత్తెవ్వ, ఎల్లవ్వ, లక్ష్మి, గంగామని, దేవూబాయీ, సూర్యకళ, సావిత్రి, పొశవ్వ తదితరులు పాల్గొన్నారు.