హైదరాబాద్, జూన్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తిరుమల శ్రీ వారి దర్శనార్థం ఆలయ మహాద్వారం వద్ద కు చేరుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్. ఎన్.వి. రమణ దంపతులకు తిరుపతి, తిరుమల దేవస్థానం ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, టిటిడి ఈవో డా.జవహర్ రెడ్డి స్వాగతం పలికారు.
ఆలయ సంప్రదాయం ప్రకారం వేద పండితుల ఆశీర్వాదంతో ఆల యంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదాలతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ దంపతులు బేడీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వెంట ఏపీ హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ కె. లలిత కుమారి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర బాబు, తిరుపతి అదనపు జిల్లా జడ్జి వై.వీర్రాజు, ప్రోటోకాల్ మేజిస్ట్రేట్ పవన్ కుమార్, తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు.
టిటిడి అదనపు ఈవో ధర్మారెడ్డి, సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్.పి వెంకట అప్పల నాయుడు పాల్గొన్నారు.