కామారెడ్డి, జూన్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః శనివారం షబ్బీర్ అలీ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భిక్కనూరు మండలం లోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన పడమటి బాపూ రెడ్డి కరోనా వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్లో చేరగా, చికిత్స అనంతరం శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉన్నందున, డాక్టర్ల సలహా మేరకు ఆక్సిజన్ అవసరమైంది.
ఆయన కుటుంబ సభ్యులు మహ్మద్ అలీ షబ్బీర్ కి ఫోన్ చేయగా వెంటనే స్పందించి, ఆక్సిజన్ సిలిండర్ పంపించి, ఆక్సిజన్ అందించారు.
ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ సమయానికి ఆక్సిజన్ అందించిన షబ్బీర్ అలీ కి తాము ఎల్లవేళల రుణపడి ఉంటామని, షబ్బీర్ అలీ కి, ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.