కామారెడ్డి, జూన్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఆదివారం కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గజ్జల బిక్షపతి, గంగాధర్ తో పాటు న్యాయవాదులు జగన్నాథం, అమృత్ రావ్ లతో సూర్య ప్రసాద్, శ్రవణ్ గౌడ్ లకు వినతిపత్రం అందజేశారు.
కామారెడ్డికి వైద్య కళాశాల ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించి, వైద్య కళాశాల ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమంలో బార్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలపాలని, గతంలో కామారెడ్డి డిగ్రీ కళాశాల భూముల రిజిస్ట్రేషన్ విషయంలో బార్ అసోసియేషన్ అండగా నిలిచిందని, ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమానికి కూడా న్యాయవాదులు అందరూ మద్దతు తెలపాలని విద్యార్థి సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, రజినీకాంత్, లక్ష్మణ్ యాదవ్, భరత్ పాల్గొన్నారు.