కామారెడ్డి, జూన్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కులను, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ భీమా చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు.
కామారెడ్డి నియోజకవర్గంలోని 20 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 10 లక్షల 53 వేల 100 రూపాయల చెక్కులను, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీబీపెట్ మండలం యాడారం గ్రామానికి చెందిన గజ్వేల్లి సందీప్, తుజాల్ పూర్ గ్రామానికి చెందిన తూరి దేవ లు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి నామినీలు గజ్వేల్లి జయమ్మ, తూరి విజయమ్మలకు 2 లక్షల రూపాయల ప్రమాద భీమా చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 755 మందికి 4 కోట్ల 67 లక్షల 96 వేల 900 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.
ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి, రోడ్డు ప్రమాదాలను గురై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఖర్చైన డబ్బులను ముఖ్యమంత్రి సహయనిధి నుండి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఒకవైపు, పార్టీ కార్యకర్తల సంక్షేమాన్ని మరోవైపు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.