నిజామాబాద్, జూన్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఏబివిపి ఇందూర్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 45 మంది కార్యకర్తలు రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు రెంజర్ల నరేష్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ కరోనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ ప్రజలకు అండగా మీకు మేమున్నాం అంటూ ఏబీవీపీ నడుము కట్టి రక్త దానం శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఏబీవీపీ అనేక సేవా కార్యక్రమలు నిర్వహిస్తుందని నరేశ్ తెలిపారు.
కార్యక్రమనికి డా.నవీన్ భాస్కర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ కరోన సమయంలో రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని, అదే విధంగా వ్యాక్సిన్ వేసుకున్న తరువాత రక్త దానం చెయ్యాలా?వద్ద? అని అపోహలో ఉన్నారని వ్యాక్సిన్ వేసుకున్న మూడు వారాల తరువాత నిర్భయంగా రక్త దానం చేయచ్చని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో వర్కింగ్ కమిటీ సభ్యులు నవీన్, విభాగ్ సంఘటన కార్యదర్శి అనిల్, ప్రతినిధులు సురేందర్ రెడ్డి, జగన్, వెంకట కృష్ణ, స్వామియాదవ్, శివ, అనిల్, రాజగణేష్ తదితరులు పాల్గొన్నారు.