కామారెడ్డి, జూన్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, మెదక్ కరీంనగర్ జిల్లా సరిహద్దుల్లో గల బీబీ పెట్ పెద్ద చెరువు సుమారు 540 ఎకరాల విస్తీర్ణంలో జలకళతో కళకళలాడుతు తొమ్మిది గ్రామాల పరిధిలో సుమారు3500 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే సామర్ధ్యం గల పెద్ద చెరువు ఎడారిగా మారడం దురదృష్టకరమని భారతీయ జనతా పార్టీ బీబీ పెట్ మండల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఇరిగేషన్ ఎస్‌సి నాగేందర్ రావు కి వినతి పత్రం అందజేశారు.
పెద్ద చెరువు లోకి నీరు ఎడ్ల కట్టవాగుద్వారా వచ్చేదని, పాలకుల నిర్లక్ష్యం, కాలానుగుణంగా మార్పులు లేకపోవడం, చెరువులోకి వచ్చే నీటి మార్గాలు మరమ్మతులు చేయకపోవడం, పర్యవేక్షణ లోపం కారణంగా వాగు ఆక్రమణకు గురి కావడం జరిగిందన్నారు.
దీంతో గత 25 సంవత్సరాలుగా బీబీ పేట పెద్ద చెరువు నిండక ఇక్కడి ప్రాంత ప్రజల బాధ వర్ణనాతీతం కావున బీబీ పెట్ చెరువు నిండడానికి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించి పెద్ద చెరువు నింపి ఇక్కడి ప్రజల చిరకాల కోరిక నెరవేర్చాలని కోరారు.
బీబీ పేట్ పెద్దచెరువు లోకి నీరు రావడానికి గల మార్గాలు
1)ఆక్రమలకు గురైనటువంటి ఎడ్ల కట్టవగును పునరుద్ధరించడం
2)మానేరు డ్యాం పై యడవరం గ్రామ శివారులో నిర్మించిన డి ఫ్లోరైడ్ పథకం ద్వారా లిఫ్ట్ పైప్‌లైన్ గుండా దోమకొండ బీబీపేట మండలాలకు తాగునీరు అందించే వారు ప్రస్తుతం ఇది అన్ని పరికరాలతో వృధాగా నిరుపయోగంగా ఉంది కావున దోమకొండ కు వెళ్లే మార్గంలో దుబ్బ బంగ్లా వద్ద గల పైప్ లైన్ కట్ చేసి బీ బీ పేట పెద్దచెరువులోకి నీరు మళ్లిస్తే చెరువు నిండడానికి ఆస్కారం ఉంది.
3) కూడవెల్లి వాగు ద్వారా పెద్ద చెరువు నింపడానికి ఆస్కారం ఉంది. ఇటీవల ఈ వాగు ద్వారా కాలేశ్వరం నీటిని వదిలి ఎగువ మానేరు నింపడం జరిగింది. కావున తుజల్ పూర్ గ్రామ శివారు నుండి గల వాగు ద్వారా లిఫ్ట ఇరిగేషన్ పెట్టి రెండు కిలోమీటర్ల దూరంలో గల బీ బీపేట పెద్దచెరువు ను నింపడానికి గల మరొక అవకాశం ఉంది. పై రెండు మార్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అధిక భారం పడకుండా ఇక్కడి ప్రజల కోరిక తీర్చే అవకాశం ఉంటుంది. కావున పైన పేర్కొన్నమార్గాలను అధికారులు పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగలరని తమ ద్వారా కోరుతున్నామన్నారు.