కామారెడ్డి, జూన్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బిజెవైఎంను సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు కలిసి పని చేయాలని, బూత్ స్థాయిలో బీజేవైఎం కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల అనంత కృష్ణ పిలుపునిచ్చారు.
ఈ మేరకు మంగళవారం భారతీయ జనతా యువ మోర్చా కామారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశము జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్స్ లో నిర్వహించారు.
సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పడాల అనంతకృష్ణ మాట్లాడుతూ జాతీయవాద భావజాలం కలిగిన యువతను ఏకం చేసి దేశం కోసం ధర్మం కోసం యువత ముందుకు వచ్చేలా అందరిని కలుపుకొని పొవాలన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి చేరేలా చూసే బాధ్యత యువతదేనన్నారు. కరోనా కష్ట కాలంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ యివ్వడమే కాకుండా ఆరు నెలల పాటు ఉచితంగా రేషన్ ఇస్తు, రైతులకు 2000 చొప్పున ఖాతాల్లో జమ చేయడం జరిగిందని అన్నారు.
బిజెవైఎం రాష్ట్ర కార్యదర్శి పటేల్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళిగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా కారణంగా అనేకమంది యువకులు తమ ఉపాధి ని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.