కామారెడ్డి, జూన్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్, రామారెడ్డి రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, పాత బస్టాండ్, పంచముఖ హనుమాన్ కాలనీల రోడ్లను, మురుగు కాలువలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ పరిశీలించారు.
పారిశుద్ధ్యం పనులు క్రమం తప్పకుండా చేపట్టాలని, రోడ్ల పక్కన మురుగునీరు నిలువకుండా చర్యలు చేపట్టాలని, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
భవాని నర్సరీని పరిశీలించారు. నర్సరీలో మొక్కల నిర్వహణ సక్రమంగా లేదని అటవీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, కమిషనర్ దేవేందర్, అధికారులు పాల్గొన్నారు.