జైలు నుండి జర్నలిస్ట్ రఘు విడుదల

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః

ఈ నెల 3వ తేదీన మార్కెట్‌లో పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఇంటి నుండి వెళ్ళిన రఘును మఫ్టీలో వచ్చిన పోలీసులు వెంబడించి బలవంతంగా అరెస్ట్ చేసి కారులో తీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే.

తర్వాత పోలీసులు కుట్ర పూరితంగా అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 13 రోజుల తరువాత రఘును బెయిల్ పై మంగళవారం విడుదల చేసారు.

ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనంచిన్న వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ తదితరులు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకొని రఘుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈ సంఘాల నాయకులు మాట్లాడారు.

మొదట్లో రఘును ఎవరు తీసుకు వెళ్లారో.. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియకపోవడంతో జర్నలిస్టులు, కుటుంబ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందారని, ఆ తరువాత సూర్యాపేట జిల్లా గుర్రంపోడు భూముల వ్యవహారంలో బాధితుల పక్షాన నిలిచి జర్నలిస్టుగా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడమే రఘు చేసిన నేరమనుకుంటే చట్టపరంగా అరెస్ట్ చేయాల్సి ఉండేదని, రఘుకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అసలు వచ్చిన వారు పోలీసులా లేక ప్రైవేట్ గుండాలా అనేది తెలియకుండా మఫ్టీలో వచ్చి బజారులో అందరూ చూస్తుండగా బలవంతంగా ఎత్తుకెళ్లిన దృశ్యాలకు సంబంధించిన ఫుటేజీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని పేర్కొన్నారు.

గుర్రంపోడు భూముల విషయంలో రఘుపై మోపిన కేసులు అక్రమమైనవనీ జర్నలిస్టుపై తప్పుడు కేసులు పెట్టి కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇవ్వకుండా తీసుకెళ్లడం సరికాదన్నారు.

అన్యాయంగా అక్రమంగా రఘును అరెస్ట్ చేసి మానవ హక్కులకు విఘాతం కల్పించారని ఫైరయ్యారు. రఘు అక్రమ అరెస్ట్ రాష్ట్రంలో జర్నలిస్టులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నదని.. రఘు అక్రమ అరెస్ట్ వ్యవహారంపై మానవహక్కులను ఉల్లంఘించిన పోలీసులపై విచారణ జరిపించాలని.. ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »