కామారెడ్డి, జూన్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నూతన కలెక్టరేట్ ఆవరణ ముందు భాగంలో మియావాకి విధానంలో మొక్కలు నాటాలని రాష్ట్ర అటవీ ముఖ్య సామాజిక వన విభాగం శాఖ ముఖ్య సంరక్షణ అధికారి రమేష్ డోబ్రియాల్ అన్నారు.
కామారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్ ఆవరణలో నాటిన మొక్కలను ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తో కలిసి పరిశీలించారు. నూతన కలెక్టరేట్ పక్కన మేడి, జువ్వి, రావి, మర్రి , చింత, మామిడి వంటి మొక్కలను నాటాలని సూచించారు.
ఇరువైపులా పచ్చదనం కనిపించే విధంగా మొక్కలు నాటాలని పేర్కొన్నారు. కలెక్టరేట్ పార్క్ ను సందర్శించారు. పార్కులో నాటిన మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, నిజామాబాద్ జిల్లా చీఫ్ కన్జర్వేటర్ ఆఫీసర్ శరవణన్, జిల్లా అటవీ అధికారి నిఖిత, నిజామాబాద్ జిల్లా అటవీ అధికారి సునీల్, ఎఫ్ డి వో శ్రీనివాసులు, ఎఫ్ఆర్వో విద్యాసాగర్, అధికారులు పాల్గొన్నారు.