కామారెడ్డి, జూన్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ముఖ్యమంత్రి రాక సందర్భంగా జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, వివరాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులతో సమీక్షించారు.
బుధవారం జనహిత భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ధాన్యం కొనుగోలు, మిషన్ భగీరథ ఇంటింటికి మంచినీరు, హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ వివరాలు, నర్సరీల నిర్వహణ, ధరణి రిజిస్ట్రేషన్స్, మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద సాగునీటి వసతి, వ్యవసాయ సాగు వివరాలు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల వివరాలు, ఆయిల్ ఫామ్, రెసిడెన్షియల్ స్కూల్స్ , హాస్టల్స్ నిర్వహణ, రేషన్ కార్డుల వివరాలు, గొర్రెల అభివృద్ధి పథకం, మత్స్య సంపద పథకం, రైతు వేదికలు, రైతు కళ్ళాలు, వైకుంఠ ధామాలు, కంపోస్ట్ షెడ్స్, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ వివరాలు 24 గంటల కరెంటు సరఫరా, జిల్లాలో మొత్తం రోడ్ల వివరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా చేకూరిన లబ్ధి, వైద్య రంగంలో కెసిఆర్ కిట్స్ క్రింద గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సహాయం, మాతా శిశు సంరక్షణ వివరాలు, ఇమ్యునైజేషన్ కార్యక్రమం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అందిస్తున్న వైద్య సహాయం వివరాలను, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ స్థల సేకరణ వివరాలు పరిశీలించారు.
సమీక్షలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ బి.వెంకట మాధవరావు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.