నిజామాబాద్, జూన్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బోధన్ పోలీసు స్టేషన్ సమీపంలో మారుతి ఓమిని వాహనంలో అక్రమంగా గుట్కా, జర్ధా వున్నదని విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేశారు.
సుమారు 7,00,000 (ఏడు లక్షలు) రూపాయల విలువ చేసే గుట్కా, జర్ధా స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు.
పట్టుకున్న గుట్క, జర్ధా కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుండి తీసుకుని వస్తున్నారన్నారు.