డిచ్‌పల్లి, జూన్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ను మోటూరి మురళి గుప్తా ఆర్య వైశ్య, మహాసభ రాష్ట్ర కార్యదర్షి, మాణిక్ భవన్ స్కూల్ అధ్యక్షులు, రావులపల్లి జగదీశ్వర్ గుప్త మణిక్ భవన్ కార్యదర్షి, మంకలి విజయ కుమార్ గుప్తా ఆర్య వైశ్య మహాసభ జిల్లా కార్యదర్షి, చిదుర శ్రీనివాస్ గుప్తా ఆర్య వైశ్య యువజన సంఘం జిల్లా అధ్యక్షులు, గాలి నాగరాజు గుప్తా అంతర్జాతీయ డైరెక్టర్ వాసవి క్లబ్, పెద్ది సాయిబాబా గుప్తా నగరేశ్వర మందిర్ అధ్యక్షులు, బి. రాజేంద్ర గుప్తా గోల్ హనుమాన్ టెంపుల్ అధ్యక్షులు, రాం లక్ష్మణ్ గుప్త డిచ్ పల్లి ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు, తెలంగాణ విశ్వవిద్యాలయం అకడమిక్ కన్సల్టెంట్స్ డా. శ్రీనివాస్, డా. పురుషోత్తం తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలో పారిశ్రామిక సంబంధిత కోర్సులు, ఉపాది అవకాశాలకు చెందిన సాంకేతిక విభాగాలను ఏర్పాటు చేయాలని సలహాలు ఇచ్చారు.
అందుకు వీసీ సానుకూలంగా స్పందించి నానో టెక్నాలజీ సంబంధిత కోర్సుల పరంగా యూనివర్సిటినీ అభివృద్ధిని విస్తృత పరుస్తానని అన్నారు.