కామారెడ్డి, జూన్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః దోమకొండ మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ గురువారం పరిశీలించారు.
ప్రకృతి వనం ముందుభాగంలో పెద్ద మొక్కలను నాటాలని సూచించారు. గ్రామంలో పారిశుధ్య పనులు పక్కాగా చేపట్టాలని కోరారు.
కార్యక్రమంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఉపాధిహామీ ఏపిడి సాయన్న, సర్పంచ్ అంజలి, అధికారులు పాల్గొన్నారు.