కామారెడ్డి, జూన్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్ లోగల గంజి వ్యవసాయ మార్కెట్ గల కామారెడ్డి డివిజన్ వ్యవసాయ అధికారి కార్యాలయంలో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి డివిజన్ వ్యవసాయ అధికారి శశిధర్ రెడ్డి చేతుల మీదుగా మాస్కులు పంపిణీ చేసినట్టు జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు అన్నారు.
ఈ సందర్భంగా కామారెడ్డి డివిజన్ వ్యవసాయ అధికారి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రతి ఒక్కరు మాస్కు ధరించి సామాజిక దూరాన్ని పాటించి వ్యవసాయ పనులు చేసుకోవాలన్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రశీధు తీసుకోవాలని నకిలీ విత్తనాల పట్ల రైతులు జాగ్రత్త ఉండాలని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతుల క్షేమం దృష్టిలో ఉంచుకొని పెట్టుబడి కోసం రైతుబంధు డబ్బులు ఈ నెల 15 నుండి నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి అని రైతులు వాటిని పెట్టుబడి నిమిత్తం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
రైతులకు పంటల విషయంలో అనుమానాలు ఉంటే దగ్గర్లో ఉన్న ఏఈవో లను సంప్రదించాలని అన్నారు. సమాచార హక్కు చట్టం 2005 అవగాహన సదస్సులతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు, అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా ఇన్చార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు మోతే లావణ్య, సంతోష్, పర్వత రావు, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.