స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం ఇవ్వాలి..

కామారెడ్డి, జూన్ 17

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులు శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గా కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనం జీవో 68 ప్రకారం 18 వేల‌ వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పి బాలరాజ్ జిల్లా నాయకుడు దశరథ్ అన్నారు.

ఈ మేర‌కు కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్ కుమార్ కు వినతి పత్రం అంద‌జేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో కార్మికులు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారని, నిత్యవసర వస్తువులు కొనలేని పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేయకుండా 2012 లో అమలైన జిఓ 68 ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వేతనాలు పెంచాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాస్పత్రిలో పని చేస్తున్న‌ కార్మికుల పై సవతి ప్రేమ చూపెడుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

గతంలో అనేకసార్లు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి తెలియజేయడం జరిగింద‌ని, వేతనాలు జీవో ప్రకారం ఇవ్వడం జరుగుతుందని గతంలో వైద్య శాఖ మంత్రి చెప్పడం జరిగింది కానీ ప్రస్తుతము ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నారు కావున జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని అన్నారు. కామారెడ్డి దోమకొండ ఎల్లారెడ్డి బాన్సువాడ మద్నూర్ కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్వైజర్ శ్రావణ్, రాజశేఖర్, కార్మికులు ఎస్ కె పా జి య, స్వరూప, ఎస్ కే రఫిక్‌, ల‌క్ష్మి, పద్మ, మమత, లక్ష్మి, సునీత, వజ్రమ్మ, బిక్షపతి, రాజేశ్వర్, సిద్ధిరాములు సందీప్, మీనా, శ్రీనివాస్, పూజ బైరమ్మ, గంగాధర్‌, రాములు, రాజయ్య, కార్మికులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »