కామారెడ్డి, జూన్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గురువారం షబ్బీర్అలీ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని అవుసుల కాలనీకి చెందిన రాఘవాపురం గోదావరికి ఆక్సీజన్ అందజేశారు.
అనారోగ్యంతో బాధపడుతూ దవాఖాన లో చేరగా, చికిత్స అనంతరం శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా యున్నందున, డాక్టర్ల సలహా మేరకు ఆక్సిజన్ అవసరమేర్పడింది.
ఆమె భర్త బ్రహ్మ చారి మహమ్మద్ అలీ షబ్బీర్ కి ఫోన్ చేయగా వెంటనే స్పందించి ఆక్సిజన్ సిలిండర్లు పంపించి, ఆక్సిజన్ అందించారు.
ఈ సందర్భంగా ఆమె భర్త మాట్లాడుతూ తాము ఆపదలో ఉన్న సమయంలో ఆక్సిజన్ పంపించిన షబ్బీర్ అలీ దేవుడని, ఆయన గతంలో కూడా ఎంతోమందికి సేవ చేశారని, ఎల్లవేళలా రుణపడి ఉంటామని, సమయానికి ఆక్సిజన్ పంపించిన షబ్బీర్ అలీకి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.