నిజామాబాద్, జూన్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ నగర పరిధిలో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నగర ప్రజలకి అవసరమైన సేవ లని అందించాలని, ఫుట్ పాత్ ల నిర్మాణం, డివైడర్ ల నిర్మాణం, సెంటర్ మీడియం లైట్ల పనుల పురోగతి మరియు నిర్వహణ గురించి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల పలు సూచనలు చేశారు.
మున్సిపల్ అధికారులు, ఆర్అండ్‌బి అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నగరం లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులతో వివరాలు తెలుసుకొని, పలు సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించడానికి వస్తున్న సందర్భంగా నగరంలో పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులని కోరారు.
కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్ , మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ , మున్సిపల్ ఇంజనీర్ సాగర్, రషీద్ , ఏడిఇ తోట రాజ శేఖర్ , ఆర్ అండ్ బి ఇఇ రాంబాబు అన్ని శాఖల ఏఇ లు, డిఇ లు పాల్గొన్నారు.