కామారెడ్డి, జూన్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి కుంభాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 20 న కామారెడ్డి జిల్లా కేంద్రానికి సీఎం వస్తున్న సందర్భంగా జిల్లాలో మెడికల్ కళాశాల తో పాటు ఇంజనీరింగ్ పాలిటెక్నిక్, ఐటిఐ, కళాశాలలు ఏర్పాటు అయ్యేవిధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కి విన్నవించారు.
కామారెడ్డి జిల్లా వెనకబడిన జిల్లా అన్ని విద్యార్థి సంఘాలుగా పది సంవత్సరాలు పోరాటం చేసి కళాశాల భూములను రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందని, దాదాపు 120 ఎకరాల కళాశాలకు చెందిన భూములు, ఇంజనీరింగ్ కళాశాల భవనం, జీవియస్ కళాశాల భవనం, కర్షక్ బి.ఎడ్ కళాశాల భవనం వృథాగా ఉన్నాయని వీటిలో నూతన విద్యా సంస్థలను ఏర్పాటు చేసినట్లయితే కామారెడ్డి ప్రాంత విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందన్నారు.
కామారెడ్డి మెడికల్ కళాశాల వచ్చినట్లయితే విద్యార్థులతో పాటు ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగానే లభిస్తాయని తెలిపారు.
కార్యక్రమంలో బిసి యువజన సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చెట్టబోయిన స్వామి, ఎన్ఎస్ యుఐ జిల్లా ఉపాధ్యక్షుడు సుధీర్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు, చంద్రకిరణ్, స్వామిగౌడ్, శివకృష్ణ, శ్రీకాంత్, రాజు, తదితరులు పాల్గొన్నారు.