కామారెడ్డి, జూన్ 17
పార్లమెంట్ నియోజకవర్గం లో ఎమ్మెల్యేలతో తనకి ఎలాంటి విభేదాలు లేవని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో పార్లమెంట్ నియోజకవర్గంలో ని ప్రజబలందరి మద్ధతుతో తను రెండవసారి ఎంపీ గా అయ్యానన్నారు.
నియోజకవర్గం లో ఉన్న అభివృద్ధి పై కృషి చెయ్యడమే తన లక్ష్యమని ఎంపి స్పష్టం చేశారు.
నారాయణ ఖేడ్ నియోజకవర్గం లో జొన్నలకేంద్రం ను ఎంపీ బిబి పాటిల్, నారాయణ ఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ప్రారంభించారు.
అనంతరం మీడియం సమావేశం ఎంపి మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి , రైతు సమస్యలు తెలిసిన వ్యక్తి అందు గురించి రైతు బంధు, రైతు బీమా, సంక్షేమ పథకాలు అమలు చేసిండని, రైతు పండించిన పంటను కూడా ప్రభుత్వ మే కొనుగోలు చేస్తుందన్నారు.
పార్లమెంట్ నియోజకవర్గం లో రైతులు జొన్నలు పండించిన పంట రావడంతో వచ్చిన పంటను ఎక్కడ అమ్మాలో తెలియక ఇబ్బందులు పడుతున్న సమయంలో తన దృష్టికి వచ్చిందని, తమ ఎమ్మెల్యేల తో కలిసి ముఖ్యమంత్రి ద్రుష్టి కి తీసుకెళ్ళడం తో ముఖ్యమంత్రి తో మాట్లాడిన వెంటనే స్పందించి జొన్నలు కొనుగోలు పై ప్రకటన విడుదల చేసిండన్నారు. అంటే ముఖ్యమంత్రికి రైతుల పట్ల అమితమైన అభిమానం ఉందని దీన్ని బట్టి అర్థమవుతుందన్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతు పండించిన పంటను ప్రభుత్వ మే కొనుగోలు చేయడం ఏ రాష్టం లో లేని విధానం మన రాష్టంలో ఉందన్నారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.