డిచ్‌పల్లి, జూన్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ రిజిస్ట్రార్ ఆచార్య నసీం, ప్రిన్సిపల్ డా. వాసం చంద్రశేఖర్ తో కలిసి గురువారం ఉదయం బిజినెస్ మేనేజ్ మెంట్, న్యాయ శాస్త్ర విభాగాలను సందర్శించారు.
మొదట బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగాన్ని సందర్శించిన వీసీ విభాగం అధ్యాపకులందరిని పరిచయం చేసుకున్నారు. విభాగంలో ఇది వరకు జరిగిన పరిశోధనలను, నూతన ఆవిష్కరణలను గూర్చి అధ్యాపకులు తెలిపారు.
విద్యార్థులు కార్పోరేట్ అండ్ గవర్నమెంట్ సెక్టార్ లో ఉద్యోగాలు పొందినట్లు పేర్కొన్నారు. సింగరేణిలో కూడా ఉద్యోగాలు సాధించినట్లు వివరించారు. ఐ ఎం బి ఎ చదివిన విద్యార్థులు కెనడా, ఆస్ట్రేలియా దేశాలలో ఎం బి ఎ చేయడానికి వెళ్లినట్లు తెలిపారు.
నేషనల్ రాక్ క్లైంబింగ్ లో విజయం సాధించిన రాజశేఖర్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందారన్నారు. ప్రిన్సిపల్ డా. వాసం చంద్రశేఖర్ నాక్ రిపోర్ట్ లో హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్ కోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారని పేర్కొన్నారు. ఇంకా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్ మెంట్, రూరల్ డెవలప్ మెంట్ కోర్సుల ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తానని వీసీ హామీ ఇచ్చారు.
న్యాయ శాస్త్ర విభాగాన్ని సందర్శించిన వీసీని నాక్ విజిట్ బృందం వారు మూక్ కోర్ట్ నిర్మాణం చేయవలసిందిగా పేర్కొన్నారు. అలాగే న్యాయ దేవత స్టార్చ్యూను నిలపాలని కోరారు. ఎల్ ఎల్ ఎం విభాగాన్ని ఏర్పాటుకోసం ఇదివరకు సమర్పించిన ప్రతిపాదనలను గూర్చి వివరించారు.
లా ఆన్ లైన్ పాఠ్యాంశాల కోసం యూ ట్యూబ్ చానెల్ డెవలప్ చేశామన్నారు. అధ్యాపకులు సాధించిన గోల్డ్ మెడల్స్, పేటెంట్ హక్కుల గూర్చి తెలిపారు.
కార్యక్రమంలో బిజినేస్ మేనేజ్ మెంట్ విభాగాధిపతి డా. రాజేశ్వరి, ఆచార్య కైసర్, డా. అపర్ణ, డా. ఆంజనేయులు, డా. వాణి, కిరణ్ రాథోడ్, బికోజి, మమత; లా విభాగాధిపతి డా. ప్రసన్న రాణి, డా. జట్లింగ్ ఎల్లోసా, డా. స్రవంతి, డా. నాగరాజు, యెండల ప్రదీప్, బాలరాజు, అలీ తదితరులు పాల్గొన్నారు.