కామారెడ్డి, జూన్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి పట్టణంలోని 15 వార్డులో పట్టణ ప్రకృతి వనం ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ సందర్శించారు.
మియావాకి విధానంలో మొక్కలు నాటాలని సూచించారు. పట్టణంలోని 18వ వార్డులో ఉన్న నర్సరీని సందర్శించారు. పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఇతర మొక్కలు వివిధ వరుసలలో ఉండేవిధంగా అటవీశాఖ అధికారులు చొరవ చూపాలని పేర్కొన్నారు.
అనంతరం ఇందిరాగాంధీ స్టేడియం వద్ద హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, కమిషనర్ దేవేందర్, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు.