మోర్తాడ్, జూన్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మోర్తాడ్ మండల కేంద్రంలో శుక్రవారం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద 45 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు.
లబ్ధిదారుల అభ్యర్థన మేరకు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సిఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించారని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలియా తెలిపారు.
మంత్రి ప్రశాంత్ రెడ్డి 45 మంది లబ్ధిదారులకు గాను 18 లక్షల 45 వేల రూపాయల చెక్కులను మంజూరు చేయించారని ప్రశాంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
చెక్కులను మండలంలోని ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో మోర్తాడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శివలింగం శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ భోగా ధరణి, ఆనంద్, సౌజన్య, ఎన్ డిసిసిబి డైరెక్టర్ భూమన్న తదితరులు పాల్గొన్నారు.