కామారెడ్డి, జూన్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు.
దోమకొండ మండలం అంచనూర్, సీతారాం పల్లి, బీబీపేట మండలం జనగాం, తుజల్ పూర్, భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామాల్లో అవెన్యూ ప్లాంటేషన్ లో నాటిన మొక్కలను పరిశీలించారు. గ్రామాల్లో కమ్యూనిటీ ప్లాంటేషన్ చేయాలన్నారు.
గ్రీన్ బడ్జెట్టు ఖర్చు చేసిన వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. కంపోస్ట్ షెడ్లు, వైకుంఠధామం ల చూట్టు గ్రీన్ ఫినిషింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లోని మురుగు కాలువలను శుభ్రం చేయాలని పేర్కొన్నారు.
అవెన్యూ ప్లాంటేషన్ సక్రమంగా లేనందున, పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉన్నందున బస్వాపూర్ పంచాయతీ కార్యదర్శి గంగ మల్లయ్యను సస్పెండ్ చేయాలని డిసివో సునందను ఆదేశించారు.
రక్షిత మంచి నీటి ట్యాంకులు ప్రతి నెల 1,11,21 తేదీలలో క్లోరినేషన్ చేయాలని సూచించారు. గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి వారికి అవసరమైన మొక్కలను అందజేయాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఉపాధి హామీ ఏపిడి సాయన్న, ఎంపీడీవోలు చెన్నారెడ్డి, నారాయణ, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.