కామారెడ్డి, జూన్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మాక్సీ క్యాబ్ డ్రైవర్ లకు కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతున్నదని జిల్లా రవాణా శాఖ అధికారి వాణి ఒక ప్రకటనలో తెలిపారు.
దీని కోసం డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు తీసుకొని సంబంధిత మున్సిపాలిటీలలో ఉచితంగా కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోవలసిందిగా ఆమె ప్రకటనలో కోరారు.