కామారెడ్డి, జూన్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదివారం కామారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్ ను ప్రారంభించడానికి వస్తున్న నేపథ్యంలో పార్కింగ్ స్థలాలను జిల్లా కలెక్టర్ ఎ.శరత్ శనివారం పరిశీలించారు.
అడ్లూర్ రోడ్లో వాహనాలు పార్కింగ్ చేయడానికి పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణ ప్రకృతి వనం పరిశీలించారు. రైల్వే గేట్ సమీపంలో ఉన్న నర్సరీని పరిశీలించారు.
నర్సరీలో ఉన్న వివిధ రకాల మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, అధికారులు పాల్గొన్నారు.