కామారెడ్డి, జూన్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు జిల్లా ఆస్పత్రి కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పి బాలరాజు, దశరథ్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా దోమకొండ, బాన్సువాడ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు 7 వేల రూపాయలు, 7 వేల 500 చాలీచాలని వేతనం ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
పెరిగిన నిత్యవసర వస్తువులు, గ్యాస్ ఇతరాలకు వేతనం సరిపోవడం లేదని, కావున 2012 జిఓ 68 ప్రకారం ఐదు సంవత్సరాలకోసారి వేతన సవరణ చేయాలి కానీ తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా ఇవ్వడం లేదన్నారు. 68 జీవో ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో వెంటనే అమలు చేయాలని అన్నారు.
కార్యక్రమంలో కార్మికులు ఎస్ పాజియా, స్వరూప, లక్ష్మి, రఫిక్, వీరేందర్, సందీప్, ఫాతిమా, జమున, బైరమ్మ, మమత, సునీత, పూజ, వజ్రమ్మ, పద్మ, విజయ, రాములు రవి, సిద్ధిరాములు, రాజేశ్వర్, దేవరాజు, రాజయ్య, దోమకొండ కార్మికులు మమత, లక్ష్మి, జి లక్ష్మి, బాన్సువాడ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.