కామారెడ్డి, జూన్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నూతన జిల్లా కలెక్టరేట్ సముదాయ భవనం, నూతన జిల్లా పోలీసు సూపరింటెండెంట్ భవనం ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న సందర్భంగా స్వాగత ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, నిజామాబాద్ జిల్లా పోలీసు కమిషనర్ కార్తికేయ పరిశీలించారు.
జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎన్. శ్వేత, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఉన్నత అధికారులు పోలీసు అధికారులు వెంట ఉన్నారు.