కరోనాతో అనాథలైన విద్యార్థులకు ఉచిత విద్య

హైదరాబాద్‌, జూన్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి, ఇంటర్మీడియట్‌లో 70 శాతానికిపైగా మార్కులు సాధించిన విద్యార్థులకు నాలుగేళ్లపాటు ఇంజినీరింగ్‌ విద్యను ఉచితంగా అందించనున్నట్లు మల్లారెడ్డి విశ్వవిద్యాలయ కులపతి డీఎన్‌ రెడ్డి తెలిపారు.

మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, పారామెడికల్‌ సైన్సెస్‌, మేనేజ్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌పాలసీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైందన్నారు.

ఈ ఏడాది కొత్తగా 70 కోర్సులు ప్రవేశపెట్టామని శుక్రవారం ఒక ప్రకటనలో వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభ చూపిన విద్యార్థులకు రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »