నిజామాబాద్, జూన్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాజీ ఏ.ఐ.సీ.సీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం నిజామాబాద్ నగరంలోని ఖానాపూర్, శాస్త్రినగర్ నిర్మల భవన్ వృద్ధాశ్రమంలో ఎన్‌ఎస్‌యుఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వృద్దులకు అన్నదానం చేశారు.
అనంతరం జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్‌లో ఎన్నో విజయాలు సాధించాలని, భారతదేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమని, దేశ అభివృద్ధి పట్ల చిత్త శుద్ది రాహుల్ గాంధీకే ఉందని, రాహుల్ గాంధీ భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రస్తుత ప్రధాని చేతిలో దేశ అభివృద్థి కుంటుపడిరదని క్రమంగా దేశ ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని,దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్థి చేయగల సమర్థుడు రాహుల్ గాంధీయే అన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా ఉపాద్యక్షుడు సాయి వరుణ్, ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా ప్రధాన కార్యదర్శులు నరందీప్, వేదమిత్ర, నాయకులు ఉమాకాంత్, వెంకీ, సాయి, మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.