నేరాల నియంత్రణలో సిసి కెమెరాలు కీలకం

నిజామాబాద్‌, జూన్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ మండలం కేశాపూర్‌ గ్రామంలో నిజామాబాద్‌ ఎ.సి.పి వెంకటేశ్వర్లు సి.సి టివి కెమెరాలు ప్రారంభించారు. గ్రామాభివృద్ధికమిటి నుండి దాదాపు 16 సి.సి కెమెరాలు కొనుగోలు చేయగా వాటిని ఎ.సి.పి చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తీకేయా ఆదేశాల మేరకు సి.సి కెమెరాలు ప్రారంభించామని, నేరాల నియంత్రణలో సి.సి కెమోరాలు ఎంతో కీలకం అని, ఆయా గ్రామాలలో ఏర్పాటు చేస్తున్న సి.సి కెమెరాలు నేరగాల్ల గుట్టు రట్టులో ఎంతో దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.

కేశాపూర్‌ గ్రామంలో 16 సిసి కెమెరాలు ప్రారంభించిన ఏసిపి వెంకటేశ్వర్లు

సి.సి కెమోరాల వలన ఇప్పటి వరకు ఎన్నో దొంగతనాలకు పాల్పడిన నేరగాళ్లను కిడ్నాప్‌ కేసులో నిందితులను ఎంతో సులువుగా పట్టుకోవడం జరిగిందన్నారు. జనరద్దీగల ప్రదేశాలలో, బస్టాండ్‌ చౌరస్తాలలో మొదలగు ప్రాంతాలలో ప్రతీ ఒక్కరు సి.సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అలా చేయడం వలన నేరాలు నియంత్రించ వచ్చని నేరం జరిగిన తర్వాత బాధపడేబదులు ముందుగానే సి.సి కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరం జరుగదని అన్నారు.

ఒక్క సి.సి కెమెరా 100 మంది పోలీస్‌ సిబ్బందితో సమానం అన్నారు. మహళలు సురక్షితంగా ఉండేందుకు మహిళలపై ఇవ్‌టీజింగ్‌ చేయకుండా ఉండేందుకు మహిళలపై అఘాయిత్యాలు జరుగకుండా సురక్షితంగా ఉండేందుకు కేశాపూర్‌ గ్రామస్థుల సహాకారంతో ఏర్పాటు చేసినందుకు ఎంతో సంతోషకరమన్నారు.

మారుమూల గ్రామాలైన కేశపూర్‌ గ్రామంలో దాదాపు 16. సి.సి కెమెరాలు ఏర్పాటుచేసుకున్న గ్రామస్తులను ఏసిపి అభినందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సురక్షితమైన భద్రతకోసం పోలీస్‌ శాఖ ఎంతో కృషి చేస్తుందని అన్నారు. పోలీసుశాఖలో గతంలో కన్న ఎన్నో మార్పులు జరిగాయని, ఫ్రెండ్లీ పోలీస్‌ ద్వారా పోలీస్‌ శాఖ ప్రజలతో మమేకంగా పనిచేస్తుందని తెలిపారు. అనంతరం యువతకు క్రికెట్‌ కిట్‌ అందచేశారు. అలాగే పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటి నీరుపోశారు.

కార్యక్రమంలో నిజామాబాద్‌ సాత్‌ రూరల్‌ సీఐ ఆర్‌. రవి, రూరల్‌ ఎస్‌.ఐ జి.లింబాద్రి, 6వ టౌన్‌ ఎస్‌.ఐ ఆంజనేయులు, కేశాపూర్‌ సర్పంచ్‌ మల్లే వనిత సుభాష్‌, ఉప సర్పంచ్‌ సర్సారెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు వెంకట్‌ రెడ్డి, గంగారెడ్డి, బోజన్న పోలీస్‌ కళాబృందం సిబ్బంది, గ్రామ ప్రజలు, సి.సి కెమెరాల మేనేజర్‌ నవీస్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »