వేల్పూర్, జూన్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం లబ్దిదారులకు అందజేసినట్టు ఆర్టిఏ మెంబర్ రాములు తెలిపారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్న వారందరికీ మంజూరు కావడంతో అందజేయడం జరిగిందని తెలిపారు.
సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరుకు కృషిచేసిన బాల్కొండ ఎమ్మెల్యే, మంత్రి వేముల ప్రశాంత్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిటిసి మోడీ మహేష్, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రతాప్, శ్రీనివాస్ గౌడ్, గంగాధర్, చాకలి నర్సయ్య, రవీందర్, కిరణ్ పాల్గొన్నారు.