ఆర్మూర్, జూన్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో జగన్నాథ్ సేవ సమితి ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసినట్లు సమితి సభ్యులు లయన్ నివేదన్ గుజరాతి తెలిపారు.
ఈ సందర్భంగా లయన్ నివేదన్ గుజరాతి మాట్లాడుతూ జగన్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. నిరుపేదలకు ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రతినిధుల సహాయంతో నిత్యవసర వస్తువులు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో నవీన్, హరికృష్ణ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.