వేల్పూర్, జూన్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడానికి తీసినగుంతలను పరిశీలించినట్టు వేల్పూర్ మండలం వడ్డెర కాలని, పడగల్ గ్రామ కార్యదర్శి కుజన్య తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం గ్రామంలో మొక్కలు నాటేందుకు గుంతలను ఏర్పాటు చేస్తున్న ఉపాధిహామీ కూలీల పనులను ఆదివారం పరిశీలించామన్నారు.
గ్రామంలో అన్ని కాలనీలలో, ప్రభుత్వ పాఠశాలలో, గ్రామ పంచాయతీ ఆవరణలో, పంట పొలాల్లో గట్లపై, చెరువు ఇరువైపులా, రోడ్ల పక్కన గుంతలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొంత మండలం కావడంతో గ్రామంలో ప్రజల సహకారంతో గ్రామాన్ని హరిత పడగల్ వడ్డెర కాలని గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు పాలక వర్గంతో ప్రజలతో కలిసి మొక్కలు నాటే విధంగా కృషిచేస్తానని తెలిపారు.
మొక్కలు నర్సరీ కేంద్రాల్లో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రజలు కూడా వారి ఇంటి ముందు మొక్కలను నాటుకునేందుకు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, మొక్కల్ని పెంచే బాధ్యత ఇంటి యజమాని తీసుకోవాలని, మొక్కలపై ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.